సినిమాలో పాత్రకు అనుగుణంగా హీరోలు బరువు పెరగడం లేదా తగ్గిపోతుంటారు. ఆఖరికి యాభైలు దాటిన సీనియర్ హీరోలు సైతం బరువు తగ్గి తమ సత్తా ఏంటో చూపిస్తారు. టాలీవుడ్ హీరోల్లో బరువు గురించి పెద్దగా పట్టించుకొని హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే. బాలయ్య బరువు విషయాన్ని చాలా లైట్ తీస్కొంటాడు. అయితే తన కొత్త సినిమా రూలర్ కోసం మాత్రం ఆయన ఏకంగా 15 కిలోల బరువు తగ్గాడు.
కెఎస్. రవి కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నారు. ఆ సినిమా పాత్ర నేపథ్యంలో కూడా బాలయ్య ఇంకాస్త బరువు తగ్గనున్నాడు. ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫాలో అవుతున్నాడు. బన్నీ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్‌లో బన్నీ సరికొత్త స్టైల్ లుక్‌లో కనిపిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ లుక్ కోసం బన్నీ చాలా బాగా కసరత్తులు చేశాడట. మొత్తం మీద బన్నీ 14 కిలోలు తగ్గాడట. ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రైనర్‌ను పెట్టుకుని రోజుకు రెండు గంటల పాటు జిమ్‌లో గడిపాడట. ఇక తన సరికొత్త హెయిర్‌స్టైల్ కోసం జుట్టు బాగా పెంచుకుని మరీ ఈ లుక్ తీసుకువచ్చినట్టు కనపడుతోంది.
ఇక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న అల వైకుంఠపురంలో వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతుంది. దువ్వాడ జగన్నాథమ్ తర్వాత బన్నీ సరసన మరోసారి పూజా హెగ్డే నటిస్తుంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.