సీఎం జగన్ సహా వైసీపీ నేతలు వణికిపోతున్నారు : అచ్చెన్నాయుడు

-

హైకోర్టు నిబంధనలకు లోబడే రాజమండ్రి నుంచి ఆయన నివాసానికి చంద్రబాబు చేరుకున్నారని.. తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. ఎక్కడ కూడా చంద్రబాబు రాజకీయ యాత్ర చేపట్టలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. విజయవాడ సీపీకి సందేశం పంపారు. వేలాదిగా ప్రజలు వచ్చిన కూడా ఎక్కడా చంద్రబాబు వాహనం దిగలేదని స్పష్టం చేశారు.

Kinjarapu Atchannaidu: జగన్‌కి దమ్ము ధైర్యం ఉంటే..: అచ్చెన్నాయుడు | ap news  acham naidu tdp ycp cm jagan chandrababu chsh

కోర్టు నిబంధనలకు లోబడి ప్రయాణిస్తున్నందున తన వాహనశ్రేణి వెంబడి ఎలాంటి వాహనాలు అనుమతించవద్దని.. సీఐ రాజుకు చంద్రబాబు చెప్పిన విషయాన్ని సీపీకి వివరించారు. ఇదే విషయాన్ని తన ప్రయాణం పర్యవేక్షిస్తున్న డీసీపీకి తెలపాలని చంద్రబాబు కోరినట్లు పేర్కొన్నారు. వైసీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై వైసీపీ నేతలను ప్రజలు చీకొడుతున్నా..ఇంకా సిగ్గులేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.ఈ భూమ్మీద తానే అపరమేధావిని అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఫీలవుతున్నారని మండిపడ్డారు. మంగళవారం బెయిల్ పై విడుదలైన చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేందుకు వచ్చిన జనసందోహాన్ని చూసి సీఎం జగన్ సహా వైసీపీ నేతలు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. కోర్టు నిబంధనలున్నా చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వేలాది మంది జనం వచ్చారని..అందుకే రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి 16 గంటలు పట్టింది అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news