హైదరాబాద్ లో భారీ చోరీ.. ఏటీఎం మిషన్ కట్ చేసి మరీ !

హైదరాబాద్ లో భారీ చోరీ జరిగినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలోని రెండు ఏటీఎంలలో భారీ ఎత్తున చోరీ జరిగినట్లు చెబుతున్నారు. ఎటిఎం మెషిన్ లను గ్యాస్ కట్టర్ తో కట్ చేసిన దుండగులు ఏటీఎం మిషన్ లో ఉన్న మొత్తం నగదును అపహరించుకు నట్లు చెబుతున్నారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా రోడ్ లో ఉన్న ఎస్బీఐ బ్యాంకు కి చెందిన రెండు ఏటీఎంలలో చోరీ చేశారు దుండగులు.

అయితే సంఘటన స్థలానికి చేరుకున్న రాచకొండ పోలీసులు దొంగతనం ఎలా జరిగింది అనే విషయం మీద దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్ కూడా చేరుకుని ఏమైనా ఆధారాలు లభిస్తాయి అనే అంశం మీద పరిశీలిస్తున్నారు. డబ్బు ఎంత పోయింది అన్న సమాచారం బ్యాంక్ అధికారులు వస్తే తప్ప చెప్పలేము అంటున్నారు పోలీసులు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేస్తున్నాయా లేదా అని దర్యాప్తు  చేస్తున్న పోలీసులు..