తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని హాస్టల్స్ లో చేర్పిస్తారు. తమ పిల్లల రక్షణ హాస్టల్ వార్డెన్ చేతిలో పెడతారు. వాళ్లని తండ్రి లాగా కాపాడాల్సిన వార్డెన్.. పశువులా మారాడు. చిన్నారులని కూడా చూడకుండా లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన హయత్ నగర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హయత్ నగర్ శ్రీ చైతన్య స్కూలులో విద్యార్థులను వార్డెన్ లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. 9వ తరగతి చదువుతున్న సాయి అనే విద్యార్థిని రాత్రి సమయంలో పక్కన పడుకోని లైంగికంగా వేధించాడు హాస్టల్ వార్డెన్ కృష్ణ.
గత ఆరు రోజులుగా రాత్రి సమయంలో పక్కన పడుకుని వేధిస్తున్నాడని భయంతో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు విద్యార్థి. మరి కొంతమంది విద్యార్థులను కూడా లైంగికంగా వేధించడంతో వార్డెన్ ని ముందుగానే (మంగళవారం రోజున) స్కూల్ నుండి పంపేశారు ప్రిన్సిపల్ మరియు సిబ్బంది. నేడు స్కూల్ వద్ద తల్లిదండ్రులు మరియు విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ స్కూల్ సిబ్బందిని విచారిస్తున్నారు.