గుజరాత్ లో నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి.. విచారణకు ఆదేశం..!

-

గుజరాత్ లోని ఓ యూనివర్సిటీలో ఐదుగురు విదేశీ విద్యార్థులపై దాడి ఘటన వెలుగు చూసింది. ఈ
విద్యార్థులు ఉజ్బెకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకకు చెందినవారు. ఈ విద్యార్థులు అహ్మదాబాద్ లోని హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేస్తున్నారు. దీంతో కోపోద్రిక్తులైన కొందరు విద్యార్థులు దీనిపై నిరసనకు దిగారు. దీంతో గొడవ చెలరేగింది. బయటి నుంచి వచ్చిన కొందరు తమ హాస్టల్ భవనంలోకి అకస్మాత్తుగా ప్రవేశించి జై శ్రీరామ్ నినాదాలు చేయడం ప్రారంభించారని విదేశీ విద్యార్థులు పేర్కొన్నారు. హాస్టల్లో నమాజ్ చేయడానికి కూడా ఆ

 

రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మా హాస్టల్ ప్రాంగణానికి బయటి నుంచి దాదాపు 10- 15 మంది వచ్చినట్లు ఆఫ్ఘన్ విద్యార్థి పేర్కొన్నారు. మేము నమాజ్ చేస్తుండగా ముగ్గురు మా హాస్టల్ భవనంలోకి ప్రవేశించారు. మేము ఇక్కడ నమాజ్ చేయకూడదని చెప్పి జై శ్రీరామ్ నినాదాలు చేయడం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును తోసి నమాజ్ చేస్తున్న వారిపై దాడి చేశారు. తమ గదులను ధ్వంసం చేశారని, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, అద్దాలు కూడా పగలగొట్టారని విద్యార్థులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news