సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తూ.. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి పాలనపట్ల ప్రజలనుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోందని కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ గారి పాలనపట్ల అభిమానంతోనే వేలాంది మంది ఇతరపార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారన్నారు.ఆదివారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ను కండువా కప్పి బీజేపీలోకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మోదీ గారి పాలన పట్ల ఆదరణ పెరుగోతందని.. దీని కారణంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి 400కు పైగా సీట్లను గెలుచుకునే లక్ష్యంతో ముందుకెళ్తోందన్నారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయన్నారు. ప్రతి ఒక్కరి నోట.. మోదీ గారి మాట వినబడుతోందని.. గత పదేళ్లలో ఇసుమంత అవినీతికి కూడా తావులేకుండా.. సమగ్రాభివృద్ధి, పేదలు, అణగారిన వర్గాలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు మొదలైన వర్గాల సంక్షేమానికి ప్రజలు ఆకర్శితులై.. ‘మేమంతా మోదీ కుటుంబం’ అని గర్వంగా చెబుతున్నారన్నారు.తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పని అయిపోయిందని.. పదేళ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడటంతపాటుగా.. నిరంకుశ, నియంతృత్వ పాలనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కల్వకుంట్ల కుటుంబ రాజకీయాలను ప్రజలు ద్వేషించారన్నారు.