టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి.. సామాగ్రి ధ్వంసం

తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రాము ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. విజయవాడ లోని పట్టాభి రాము ఇంటిపై దాడి చేసిన దుండగులు… ఆయన ఇంటిలోని సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఇవాళ ఉదయం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి మీడియా సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

pattabhi
pattabhi

తాడేపల్లి ప్యాలెస్ లోకూర్చొని పోలీస్ శాఖను తనగుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్న బోషడీకే మాకు నోటీసులిస్తున్నాడని.. ఆ దద్దమ్మకు, చవటకు నిజంగా దమ్ము,ధైర్యముంటే ఏపీలో సాగుతున్న మాదకద్రవ్యాలు, గంజాయిపై దాడిచేసిన ఇతర రాష్ట్రాలపోలీసులకు నోటీసులివ్వాలని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని గంజాయిసాగు, రవాణావ్యవహారాన్ని, దానిస్మగ్లర్లను ప్రశ్నించిన తెలంగాణ, తమిళనాడు,కర్ణాటక, ఉత్తరప్రదేశ్ పోలీసులకు కూడా నోటీసులిస్తారా? అని పోలీసులను ప్రశ్నించారు.

ఇతరరాష్ట్రాల పోలీసులకు నోటిసులిచ్చి, వారిని ప్రశ్నించగల దమ్ము, ధైర్యం తాడేపల్లి పెదపాలేరుకు, జగన్ ప్రభుత్వానికి ఉన్నాయా ? అని ప్రశ్నించారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్ల చేతిలోదాడికిగురైన నల్గొండ పోలీసులకు నోటిసులివ్వగల ధైర్యం తాడేపల్లి పాలేరుకు ఉందా? అని నిలదీశారు. అయితే పట్టాభి ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే.. ఆయన ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు.