700 మందిని పెళ్లిచేసుకున్న రాజ..వీళ్లు చాలరన్నట్లు 300మంది పరిచారికలు కూడా..ఇంతకి ఎందుకు అలా చేశారంటే..!

-

అప్పట్లో రాజులకు బహు భార్యత్వం అనుమతి ఉండేది. అంటే ఇద్దరు మహా అయితే ముగ్గరు అనుకుంటాం. మరికొందరు పదిపదిహేను మందిని కూడా చేసుకున్న రాజులు ఉన్నారు. వాళ్లంటే రాజులు, సంపదలో కొరవ ఉండదు కాబట్టి ఇలా చేసేసుకుంటారు అనుకుంటాం. అప్పట్లో వారికి ఇది మామూలు విషయమే..కానీ ఇజ్రాయిల్ కు చెందిన ఓ రాజు అయితే ఏకంగా 700మందిని పెళ్లిచేసుకున్నాడు. వామ్మో అంతమందినా అనిపిస్తుంది కదా..అసలు ఈయన కథేంటో మీరు ఓ లుక్కోయండి.

ఇజ్రాయిల్ కు చెందిన సులేమాన్ అనే రాజుఏకం గా 700ల పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయనకు పెళ్లి చేసుకోవడం అంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన నిత్య పెళ్లికొడుకులా ఉండేవాడట. ఇదేం ఫాన్టసీరా బాబు అనిపిస్తుంది కదా… ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ ఉండేవాడు. ఏ దేశ పర్యటనకు వెళ్లినా.. అక్కడి దేశంతో సత్సంబంధం కోసమే ఆయన అక్కడి వారిని పెళ్లి చేసుకునే వారట. ఆయనకు 700 ల మంది భార్యలతో పాటు 300 మంది పరిచారికలు కూడా ఉన్నారట. పరిచారికలు అంటే తెలుసుగా..పక్కనే ఉండి సపర్యలు చేసేవాళ్లు.

700ల మంది భార్యలు ఉన్నా కూడా మరో 300 ల మంది అందమైన యువతుల్ని తనకు సపర్యలు చేయించుకునేందుకు నియమించుకున్నాడట. ఆయన భార్యలలో చాలా మంది విదేశీ యువరాణులు కూడా ఉండటం విశేషం. ఆరోజుల్లోనే ఆయన పెళ్లి గురించి ప్రపంచమంతా చర్చించేవారట.కానీ ఇంతమంది భార్యలున్న సులేమాన్ వారసత్వం గరించి ప్రస్తావన లేదు. వాళ్లు ఎంతమంది, ఎలా ఉన్నార. అసలు పుట్టరా లేదా ఇలాంటి విషయాలు ఏమి బయటకురాలదు. అనేక గ్రంథాల్ల సులేమాన్ పెళ్లి విషయాన్ని ప్రసావించారు.

అంతర్జాతీయంగా సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ఆయన ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటున్నాడని చెప్పుకునేవారు. అందుకే, ఆయన పలువురు విదేశీ యువరాణులను పెళ్లి చేసుకున్నారు. కేవలం పెళ్లిళ్లు చేసుకునే కాదు.. ఆయన ప్రసిద్ధ జెరూసలేం ఆలయాన్ని..పలు చారిత్రాత్మక కోటలను కూడా నిర్మించారట. అనేక రాజ భవనాలను కూడా సులేమాన్ నిర్మించారు. అయితే.. ఆయన చేసుకున్న పెళ్లిళ్ల సంఖ్యను మాత్రం ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేదు. ఇకచేయలేరు కూడా..ఈరోజుల్లో ఒక్క పెళ్లి చేసుకునే వేగలేక చస్తున్నారు. చాలామందికి గొడవలు, సమస్యలు. ఎలాగో చేసుకున్నాం కదా అని భరిస్తున్న వారు ఉన్నారు. ఇక అన్ని పెళ్లిళ్లు అంటే ఇక సాధ్యమయ్యే పనికాదు.

Read more RELATED
Recommended to you

Latest news