వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు: చంద్రబాబు నాయుడు

-

తెలుగుదేశం పార్టీ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరులోని షాదీ మంజిల్‌లో ఆయన ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పరిపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలన్నారు. స్వార్థం కోసం దోపిడి చేసి మోసం చేస్తే ప్రజలు గుణపాఠం చెబుతారని వార్నింగ్ ఇచ్చారు .

తెలుగుదేశం పార్టీ హయాంలో హైదరాబాద్‌లో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేశాం అని గుర్తు చేశారు. హజ్‌ హౌస్‌ నిర్మించి పలువురిని మక్కా పంపించాం. కడప, విజయవాడలో హజ్‌హౌస్‌లు నిర్మించాం అని తెలిపారు. రూ.8 కోట్లు ఖర్చు పెట్టి షాదీ మంజిల్‌ కట్టించాం.5 సంవత్సరాల వైసిపి పాలనలో ఒక్క భవనమైనా నిర్మించారా? అని ప్రశ్నించారు. మీకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్నారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు పెరిగాయి. నాసిరకం మద్యంతో కిడ్నీలు పాడై చనిపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి హయాంలో రొట్టెల పండుగను రాష్ట్ర స్థాయి పండగ చేశాం.అబ్దుల్‌ కలాం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశాం. వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి” అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news