దేవాలయాలయాలపై దాడులు… ఏం చర్యలు తీసుకున్నారో చెప్పిన ఏపీ డీజీపీ

-

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడులపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఈరోజు ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా వుందో అర్ధం చేసుకోవాలి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికి తెసిసినవే అని వెల్లడించారు. దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అన్నారు.

దేవాలయాల్లో భద్రత ప్రమాణాలను మెరుగుపరచాలి అని సూచించారు. మన సాంస్కృతి, సంప్రదాయలకు దేవాలయాలే మూలం అన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్ లో చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేవాలయాలు అధిక సంఖ్యలో ఉన్నాయి అని వెల్లడించారు. దేవాలయాల పాలక మండలి, ఈవోలు చర్చించుకుని దేవాలయాలను పరిరక్షించుకోవాలని సూచించారు. దుర్గగుడిలో వెండి సింహాల మయంలో చాలా వివాదం తలెత్తింది అన్నారు.

వెండి సింహాల మయంతో అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి అని వెల్లడించారు. దుర్గమ్మ దయతో ఆ నేరస్తుడుని పట్టుకోవడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది అని పేర్కొన్నారు. 47,734 దేవాలయాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందిఅని వివరించారు. 59,443 దేవాలయాలను సర్వే చేసి వాటికి జీవో ట్యాగింగ్ చేశాం అని, 23,832 ఆలయాల్లో గ్రామ రక్షక దళాలను పెట్టాలను చర్యలు చేపట్టాo అని వివరించారు. దేవాలయలపై దాడులు చేస్తున్న 373 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో దేవాలయాలపై దాడులకు పాల్పడిన 4873 మందిని విచారించాము అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news