నీకు తెలిసిందే జ్ఞానం అనుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలిపే కథ..

-

జ్ఞానం.. ఏ విషయంలో ఎవరికి ఎంత జ్ఞానం ఉందో ఎవ్వరమూ చెప్పలేం. పరిస్థితులు ఎదురైనపుడు వారి వారి విషయం బయటకు తెలుస్తుంది. తనకే జ్ఞానం ఉందని అవతలి వాళ్ళని చులకనగా చూసే ఒక వ్యక్తి తనకి లేనిదాన్ని తెలుసుకోలేక పోయిన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక మేధావి, బాగా చదువుకున్న వ్యక్తి వేరే ఊరు వెళ్దామని చెప్పి, పడవలో ప్రయానమవుతున్నాడు. ఆ పడవ నడిపే అతనితో మాట్లాడ్డం ఇష్టం లేక మౌనంగా కూర్చున్నాడు. కానీ ఎంతకీ ఊరు రాకపోయేసరికి బోర్ వచ్చింది. పడవ నడిపే అతనితో మాటలు కలుపుదామని చెప్పి ఇలా అన్నాడు.

ఏయ్, నువ్వేం చదువుకున్నావ్..

దానికి ఆ పడవ నడిపే అతను.. నేనేమీ చదువుకోలేదు స్వామీ అన్నాడు.

అప్పుడు ఆ మేధావి, నువ్వు మాట్లాడే భాషలో గ్రామర్, పొనెటిక్స్ లాంటివి తెలుసా అన్నాడు. దానికి కూడా ఆ పడవ నడిపే అతను తెలియదని చెప్పాడు.

అప్పుడు ఆ మేధావి ఇలా అన్నాడూ. నువ్వు మాట్లాడే భాషలో వ్యాకరణం కూడా తెలియదంటే నీ జీవితాన్ని చాలా వేస్ట్ చేసుకున్నావ్ అని అన్నాడు. దానికి ఎలాంటి సమాధానం ఇవ్వని పడవ నడిపే అతను మౌనంగా ఉన్నాడు.

కొద్ది సేపటి తర్వాత తుఫాను ప్రారంభమయ్యింది. ఆ గాలులకి పడవ అటూ ఇటూ ఊగుతుంది. కొద్ది కొద్దిగా పడవలోకి నీళ్ళు రావడం మొదలయ్యాయి. అప్పుడు పడవ నడిపే అతను ఇలా అన్నాడు.

మీకు ఈత వచ్చా స్వామీ..

ఆ మేధావి లేదు అన్నాడు.

ఐతే మీ జీవితంలో చాలా టైమ్ వేస్ట్ చేసారు. ఇప్పుడు తుఫాను గాలికి పడవ మునగబోతుంది. ఈత వస్తేనే మీరు బ్రతకగలరు అని సమాధానం ఇచ్చాడు.

అందుకే ఎవరికి ఎందులో ప్రవేశం ఉందో తెలియనపుడు ఎవరి జ్ఞానాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.

ఈ కథ డేర్ టూ డు మోటివేషన్ యూట్యూబ్ ఛానల్ వారు పబ్లిష్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news