నేడు ప్రపంచంలో వాణిజ్య రంగం రాకెట్ లాగా దూసుకుపోతుంది. కొంత ఒరకు ఆర్థికంగా స్థిరపడిన ప్రతి ఒక్క వ్యక్తి కారు కొనాలి అనుకుంటాడు.. అందులో ఆడి కారు అంటే పిచ్చి అందరికీ.. అలెక్సి అనే యూరప్ దేశం లో ఉన్న వ్యక్తి కి ఆడి కారు కొనాలి అని ఆశ కలిగింది. కానీ అతని ఆర్థిక స్తోమతకు కారు ధర చాలా ఎక్కువ.. అందుకే ఓ చిత్రమైన ఆలోచన అతని మెదడులో మెదిలింది. తన దగ్గర ఉన్న రెండు గుర్రాలతో కారు నిర్మించాలని నిశ్చయించుకున్నాడు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2020/08/n20511007812363462de236f39d409ea41eb087ea0efa1d3bef793ce02bd18ac8d5a11e8c6.jpg)
తన దగ్గర ఉన్న ఈ రెండు జంతువులతో… కారు నిర్మించడానికి ముందుకు అడుగులు వేశాడు. పాత కారు ముందు భాగంలో ఉన్న యంత్రాలను తీసేసి.. వాటికి బదులుగా ముందు రెండు గుర్రాలను అమర్చి కారు లోపల ఆయన దర్జాగా కూర్చుని అతను పనులు చూసుకుంటున్నాడు. పశువుల కాపరి గా ఉంటున్న అతను ను ఈ సరికొత్త కారులో కూర్చుని పశువులను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు.