విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. సిఎం జగన్ మరణించిన వారికి ఆర్ధిక సాయం కూడా ప్రకటించారు. ఇక మరణించిన వారి వివరాలు ఒకసారి చూస్తే…
స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు, మొవ్వ. సుంకర బాబు రావు , సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.). మజ్జి గోపి మచిలీపట్నం. స్వర్ణలత పొన్నూరు, నిడుబ్రోలు గ్రామం. 6 మృతదేహాలు ఇంకా గుర్తించవలసి ఉంది…( బంధువులు రావాలి) అని అధికారులు పేర్కొన్నారు. పూర్తి గా కాలిన ఒక మృత దేహం గుర్తించలేకుండా ఉంది.