ఆస్ట్రేలియా మరియు బంగ్లాదేశ్ లకు ఈ వరల్డ్ కప్ లీగ్ స్టేజ్ లో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో ఇరు జట్లు కూడా విజయంతో ముగించాలని బరిలోకి దిగారు. ఇందులో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్ లలో 306 పరుగులు చేసింది. కెప్టెన్ మరియు ఆల్ రౌండర్ షకిబుల్ హాసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూవురం కావడంతో శాంటో కెప్టెన్ గా బాధ్యతలను నిర్వర్తించాడు. బంగ్లా ఆటగాళ్లలో శాంటో (45), హృదయ్ (74) లు రాణించారు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ లో అబాట్ మరియు జాంపా లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఇక ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సాధించాలంటే బంగ్లాదేశ్ లాంటి యువకులతో నిండిన బౌలింగ్ యూనిట్ ను సమర్థవంతంగా ఎదుర్కోవలసి ఉంది.
మాక్స్ వెల్ లేకపోవడంతో ఆస్ట్రేలియా ఈ స్కోర్ ను ఛేదిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. తమ తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఎవరు విజయంతో ముగిస్తారు అన్నది తెలియలాంటే ఇంకాసేపు వెయిట్ చేయక తప్పదు.