లక్నో లో ఆస్ట్రేలియా మరియు శ్రీలంకల విజయం కోసం హోరా హోరీగా పోటీ పడుతున్నాయి. ఈ వరల్డ్ కప్ లో ఏ మ్యాచ్ ముందు వరకు రెండు జట్లు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయి ఎన్నో విమర్శలను మూటగట్టుకున్నారు. ఈ విమర్శలను పారదోలాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలి. కానీ శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని సగం మ్యాచ్ ను ఓడిపోయింది. ఆస్ట్రేలియా లాంటి బలమైన బ్యాటింగ్ లైన్ అప్ కు కేవలం 210 పరుగులు లక్ష్యం ఇచ్చింది. ఆరంభంలోనే మధుశంక రెండు వికెట్లు తీసి ఆసీస్ ను దెబ్బ తీసినా మరో బౌలర్ నుండి సహాయం లేకపోవడంతో ఆస్ట్రేలియా ధారాళంగా పరుగులు చేస్తూ విజయం దిశగా దూసుకుపోతోంది. మార్ష్ (52) అర్ద సెంచరీ చేసి జట్టుకు విలువైన పరుగులు చేసి రన్ అవుట్ కాగా, ప్రస్తుతం క్రీజులో లబుచెన్ (34) మరియు ఇంగ్లిష్ (46) లు ఉన్నారు.
వీరిద్దరూ నిలకడగా ఆడుతూ లక్ష్యాన్ని పూర్తి చేసి వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మ్యాచ్ శ్రీలంక ఓడిపోతే ఇక సెమీస్ దారులు మూసుకుపోయినట్లే.