తెలంగాణాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న BRS మళ్ళీ గెలవడానికి సమాయత్తం అవుతోంది. నవంబర్ 30న జరగనున్న ఎన్నికలలో తమ పార్టీ తరపున పోటీ చేసే వారికీ నిన్నటి నుండి బి ఫారం లు ఇస్తూ వస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ నుండి గెలుపుగుర్రం టి పద్మారావు పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యే పద్మారావు గతంలో 2004 లో, ఆ తర్వాత వరుస౦గా 2014 మరియు 2018 లోనూ TRS నుండి గెలిచారు. అందుకే ఈసారి కూడా ఆయననే కేసీఆర్ నిలబెడుతున్నారు. కాగా ఈ సీట్ చరిత్ర చూస్తే 1952 నుండి జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ 6 సార్లు గెలుపొందగా, టీడీపీ , TRS లు మూడు మూడు సార్లు గెలిచాయి. కాగా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో BRS కు గట్టి పోటీ ఇస్తుందని అంతా నమ్ముతున్న కాంగ్రెస్ నుండి సంతోష్ కుమార్ సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తున్నారు.
మరి గత రెండు ఎన్నికలలోనూ గెలిచిన పద్మారావును కాంగ్రెస్ అభ్యర్థి ఓడిస్తాడా ? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్ కు ప్రజాదరణ బాగా పెరగడంతో ఇదేమీ కష్టం కాదని కొందరు అంటున్నారు.