ఆదిలోనే తడబడ్డ ఆస్ట్రేలియా.. 2 వికెట్లు ఫట్‌

-

ఇండోర్ స్టేడియంలో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా క‌ష్టాల్లో ప‌డింది. 400 ప‌రుగుల ఛేద‌న‌లో 9 ప‌రుగుల‌కే ఆసీస్ రెండు కీల‌క వికెట్లు ప‌డ్డాయి. ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఓపెన‌ర్ మాథ్యూ షార్ట్‌(9), స్టీవ్ స్మిత్‌(0) ఔట‌య్యారు. అయితే.. హ్యాట్రిక్ బంతికి మార్న‌స్ ల‌బూషేన్‌(1) ఒక ప‌రుగు తీశాడు. మ‌రో ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌(0) క్రీజులో ఉన్నాడు. మొద‌ట ఆడిన టీమిండియా 5 వికెట్ల న‌ష్టానికి 399 ప‌రుగులు చేసింది.

IND vs AUS 2023, 2nd ODI: Match Prediction, Dream11 Team, Fantasy Tips &  Pitch Report | India vs Australia | Cricket Times

బ్యాటింగ్‌కు అనుకూలించిన‌ పిచ్‌పై ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌(104), శ్రేయ‌స్ అయ్య‌ర్(105) సెంచ‌రీల‌తో చెల‌రేగారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్(72 నాటౌట్), కెప్టెన్ కేఎల్ రాహుల్(52 ) దంచి కొట్టారు. దాంతో, టీమిండియా 5 వికెట్ల న‌ష్టానికి 399 ప‌రుగులు చేసింది. వ‌న్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే అత్య‌ధిక స్కోర్ కావ‌డం విశేషం. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ తీసుకున్నాడు. అత‌డి అంచ‌నాల‌ను నిజం చేస్తూ కంగారు బౌల‌ర్లు ఆదిలోనే ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్‌(8) వికెట్ తీశారు. అయితే.. ఆ త‌ర్వాతే అస‌లు విధ్వంసం మొద‌లైంది. ఆసీస్ పేస‌ర్ల‌ను ఉతికార‌సిన శుభ్‌మ‌న్ గిల్‌(104), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(105) సెంచ‌రీల‌తో క‌దం తొక్కారు.

Read more RELATED
Recommended to you

Latest news