ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ 417… డేవిడ్ వార్నర్ మరోసారి చెలరేగుతాడా !

-

ఆస్ట్రేలియా టాస్ గెలిచి మంచి బ్యాటింగ్ ట్రాక్ మీద ఎందుకు బౌలింగ్ ఎంచుకుంది అని ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు. ఎందుకంటే… సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసిన 25 ఓవర్లు స్కోర్ ఓవర్ కు 5 మాత్రమే ఉంది. కానీ ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.. ముఖ్యంగా క్లాజెన్ క్రీజులోకి రావడంతో కొన్ని బంతులు నిదానంగా ఆడినా ఆ తర్వాత విశ్వరూపం చూపించాడు. తాను ఎదుర్కొన్న 83 బంతుల్లో 13 ఫోర్లు మరియు 13 సిక్సులతో 174 పరుగులు చేశాడు. ఇక మిల్లర్ సైతం తాను తోచిన పరుగులు చేసి జట్టు స్కోర్ ను అమాంతం పెంచేశారు… ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అయిదు వికెట్ల నష్టానికి 416 పరుగులు చేసింది. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంత భారీ స్కోర్ ను ఛేదించడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. కానీ ఆస్ట్రేలియాకున్న బ్యాటింగ్ బలం చూస్తే సాధించడానికి ఛాన్సెస్ ఉన్నాయి.

ఇక ఓపెనర్ లుగా వచ్చే డేవిడ్ వార్నర్ మరియు ట్రావిస్ హెడ్ లు కనుక చక్కని ఆరంభాన్ని ఇస్తే ఈ స్కోర్ ను ఛేదించడం కష్టం కాదు.. అయితే దురదృష్టం ఓపెనర్ వార్నర్ వికెట్ ను త్వరగానే ఆస్ట్రేలియా కోల్పోయింది.. కేవలం 12 పరుగులు చేసిన వార్నర్ అవుట్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news