T20 world Cup : బంగ్లాపై 6 ఓవర్లలో… గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆసీస్

-

టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజున ఆస్ట్రేలియా మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య భీకర పోరు సాగింది. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో… ఆస్ట్రేలియా జట్టు అవలీలగా విజయం సాధించింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో రాణించిన ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ జట్టుపై గ్రాండ్ సాధించింది.

74 పరుగుల లక్ష్యాన్ని కేవలం.. రెండు వికెట్లు కోల్పోయి 6.2 ఓవర్లలోనే చేధించింది ఆస్ట్రేలియా జట్టు. ఓపెనర్ ఆరోన్ ఫించ్ 40 పరుగులు డేవిడ్ వార్నర్ 18 పరుగులు మరియు మార్చి 16 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

ఇక అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా దేశ్ జట్టు … కేవలం 73 పరుగుల కే కుప్ప కూలింది. 15 ఓవర్లు ఆడిన బంగ్లా దే శ్ జట్టు.. 73 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ నుంచి మిడిలార్డర్ వరకు అందరూ బ్యాట్స్మెన్ విఫలం కావడంతో 73 పరుగులు చేసింది. ఇక 74 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేధిచింది ఆస్ట్రేలియా జట్టు.

Read more RELATED
Recommended to you

Latest news