ఆస్ట్రేలియన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు కెప్టెన్ ఆరోన్ ఫించ్. 35 ఏళ్ల అతను ఆదివారం కైర్న్స్‌లో న్యూజిలాండ్‌తో తన 146వ అలాగే… చివరి వన్డే మ్యాచ్ ఆడనున్నాడు ఆరోన్ ఫించ్.
ఈ మ్యాచ్ అనంతరం…పరిమిత ఓవర్ల క్రికెట్ అంటే వన్డేలకు గుడ్ బై చెప్పనున్నాడు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. టీ 20, ఐపీఎల్, దేశవాలీ, టెస్టులకు మాత్రం ఆరోన్ ఫించ్.. ఆడనున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు ఆరోన్ ఫించ్.
కాగా… ఆరోన్ ఫించ్ 50 ఓవర్ల గేమ్‌లో ఇప్పటి వరకు 5,401 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో… 17 సెంచరీలు చేసి… రికీ పాంటింగ్ (29), డేవిడ్ వార్నర్ మరియు మార్క్ వా (18) తర్వాతి స్థానంలో ఉన్నాడు ఆరోన్ ఫించ్. వచ్చే నెలలో సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్ టైటిల్‌ను కాపాడుకునేందుకు సిద్ధమవుతున్న ట్వంటీ20 జట్టుకు ఫించ్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
https://twitter.com/ICC/status/1568415367978008576?s=20&t=8ia1M6fT6mtrbjYAQpMYrw