ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై ఆటోడ్రైవర్లు బుధవారం హనుమకొండ వేయిస్తంభాల దేవాలయ సమీపంలో భిక్షాటనతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ల సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకుడు ఇసంపెల్లి సంజీవ మాట్లాడుతూ ….. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు చేసి 25 రోజులు అవుతుందని దీంతో ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటోడ్రైవర్లకు వెంటనే జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశాం . కానీ దీని గురించి ప్రభుత్వం స్పందించక పోవడంతో భిక్షాటన ద్వారా నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు మడికొండ బాబు,మంద శ్రీధర్‌రెడ్డి, సముద్రాల సాయిలు,కంకోట్ల జయరాం, పసునూరి బాబు, రాజు, హైమద్,చీకటి కుమార్, గుండా రమేశ్, పసునూరి శ్రీనివాస్, బొల్లం సంజీవ,ఖాజాపాషా, మాషుక్, భూక్యానాయక్, పద్మారావు పాల్గొన్నారు.