టోక్యో ఒలంపిక్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పారాలింపిక్స్ లోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పారాలింపిక్స్ లో భారత్ కు రెండు సిల్వర్ పతకాలు, ఒక బ్రాంజ్ మెడల్ రాగా తాజాగా పారాలింపిక్స్ లో భారత్ బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 19 ఏళ్ల అవని లేఖరా షూటింగ్ లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అంతే కాకుండా పారాలింపిక్స్ లో బంగారు పతకం సొంతం చేసుకున్న మొదటి మహిళగా నిలిచింది.
10 మీటర్ల ఎయిర్ రైఫింగ్ విభాగంలో అవని ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. షూటింగ్ లో ఈ యేడాది భారత్ కు ఇదే తొలి పతకం. ఈ విజయంతో అవని ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. దాంతో ప్రధాని నరేంద్ర మోడీ అవని విజయం పై ప్రశంసలు కురిపించారు.ఇదిలా ఉండగా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నివాసి. చిన్న నాటి నుండి అవనిని ఆమె తండ్రి ఎంతగానో ప్రోత్సహించారు. అవని ఎన్నో క్రీడలు నేర్చుకోగా ఆమె షూటింగ్ ను ఎంతో ఇష్టపడింది.