నా తల్లిదండ్రులు చచ్చి పోయారని హేమంత్ భార్య అవంతి పేర్కొన్నారు. నాకు మంగళసూత్రాలు ఇవ్వాల్సిన తల్లిదండ్రులు వాటిని తీసుకున్నారని వారు ఇంకా నాకు ఎక్కడ తల్లిదండ్రులవుతారని ఆమె ప్రశ్నించారు. అల్లుడిని ఎవరైనా చంపుకుంటారా ? అని ప్రశ్నించిన ఆమె నాకు న్యాయం చేయాలని అన్నారు. హేమంత్ హత్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని, యూగేందర్ రెడ్డికి ఎన్కౌంటర్ శిక్ష పడతదని ఆమె అన్నారు.
నాకు వారంతా చచ్చినట్టేనని అన్నారు. నా జీవితం రోడ్డుపైన పడేసారన్న ఆయన నేను ప్రేమించిన వాడిని చంపడమే నా తల్లిదండ్రులు నాపై చూపే ప్రేమా ? అని ఆమె ప్రశ్నించారు. 15 మంది ఇన్వాల్వ్ అయ్యి చంపుతారా బుద్ధి ఉందా ? వాళ్ళు ఉన్న పోయినా నాకు సంబంధం లేదని అన్నారు. 8 సంవత్సరాలు హేమంత్ తో రిలేషన్షిప్ లో ఉన్నానన్న ఆమె నేను నా భర్త తో ఉండవలసిన సమయం నాలుగు నెలలా ? అని ప్రశ్నించారు. హేమంత్ ను చంపడం వల్ల ఎవరు సుఖ పడ్డారు ?