తెలంగాణా జూనియర్ కాలేజ్ లకి ఆ విషయంలో ఊరట !

-

తెలంగాణా జూనియర్ కళాశాలలకు ఫైర్ ఎన్ఓసీల విషయంలో మినహాయింపులు ఇస్తూ హోం  శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల భవనాల ఎత్తు 15 మీటర్ ల కన్నా తక్కువ ఎత్తు ఉంటే ఫైర్ నిబంధనల సడలించేలా ఉత్తర్వులలో పేర్కొన్నారు. 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటే చట్ట ప్రకారం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కళాశాలలకు మాత్రమే సడలింపులు వర్తించనున్నాయి.

కళాశాలలు ప్రతి 15 మీటర్ ల రేడియస్ లో ఒక ఫైర్ ఎక్సటింగ్విసర్ ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకటి కంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉంటే రెండు దారులు ఉండాలని లేకుంటే ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. అలానే 10 వేల లీటర్ ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ లను బిల్డింగ్ పైన ఏర్పాటు చేయాలని, అత్యవసరాల్లో ఆ నీటిని వాడేలా ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  అలానే ప్రతి కళాశాల సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని కూడా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news