విశాఖ ఉక్కు రిలేదీక్షల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకవిధంగా ఉప్పు, నిప్పులా మారిన మాజీమంత్రి గంటా… మంత్రి అవంతి శ్రీనివాస్ ఒకే వేదికపై కలుసుకున్నారు. ఉక్కుపోరాటానికి సంఘీభావం ప్రకటించిన ఇద్దరు నేతలు ఒకే వేదిక పంచుకోవాల్సి వచ్చింది. ఎన్నికల తర్వాత తొలిసారిగా ఒకే వేదికపైకి పాత మిత్రులు రావడంతో కాస్త సందడి వాతావరణం నెలకొంది. గంటా,అవంతి కలిసి కట్టుగా చంద్రబాబు,జగన్ లను ఒప్పించి ఒకే వేదికపైకి తీసుకురావాలని సిపిఐ నారాయణ కోరారు.
ఇక అవంతి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఒరిస్సా ఇకటే రాష్ట్రమా, ఏపీ వాదనలు పరిగణలోకి తీసుకోరా ? అని ప్రశ్నించారు. అత్యధికంగా పన్నులు సకాలంలో చెల్లించే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్న ఆయన పోస్కో వాళ్ల స్టీల్ ప్లాంట్ ఒరిస్సాలో పెట్టించుకోవాలని అన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం పై మాట్లాడిస్తామని అన్నారు. భారతదేశం అంటే హిందీ మాట్లాడే వాళ్లే భారతీయులు గా గుర్తిస్తారు, రిలే నిరాహారదీక్ష శిబిరాల్లో హిందీలో కూడా ఫ్లెక్సీలు ఏర్పటు చేయాలని అన్నారు.