అవతార్ 2: ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ మటుమాయం..!!

-

జేమ్స్ కామెరూన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. అందుకే ఆయన తెరకేక్కించిన అన్ని సినిమాలు కూడా రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయన తెరకెక్కించిన అవతారం సినిమా ఏ స్థాయిలో రికార్డులను బ్రేక్ చేసిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ రికార్డులను బ్రేక్ చేయడానికి అవతార్ 2 సినిమాతో వచ్చాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలైన ఈ సినిమా చైనాలో కూడా విడుదలవడంతో బాక్సాఫీస్ లెక్కల్లో చాలానే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.

సినిమా మొదటి వీకెండ్ లోని 550 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసేలా కనిపిస్తోంది. కేవలం అమెరికాలోనే మొదటి వీకెండ్ లో 250 మిలియన్ డాలర్లను రాబట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఇది 2019లో విడుదలైన అవుతార్ కంటే మూడు రెట్లు ఎక్కువ అని చెప్పవచ్చు. తాజాగా బుకింగ్స్ జరిగిన విధానాన్ని బట్టి చూస్తే చైనాలోనే 200 మిలియన్ డాలర్లు రాబట్టేలా కనిపిస్తోంది. అలా ఈ చిత్రం వీకెండ్ లో 550 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని చెప్పవచ్చు.ఇండియాలో అయితే ఈ చిత్రం అవెంజర్ ఎండ్ గేమ్ రికార్డులను కొట్టేందుకు రెడీగా ఉంది. ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ కలెక్టెడ్ హాలీవుడ్ మూవీ కాగా.. మొదటి రోజే రూ.53 కోట్లు కలెక్ట్ చేసి.. లాంగ్ రన్ లో రూ.370 కోట్లు కొల్లగొట్టింది. అయితే అవతార్ 2 ఇప్పుడు ఆ రికార్డులను చెరిపేసే ప్రయత్నం చేయబోతోంది.

గతంలో అవతార్ ఫస్ట్ పార్ట్ , ఎండ్ గేమ్ సినిమాలను ఇండియాలో 2845 స్క్రీన్ లలో రిలీజ్ చేయగా ఇప్పుడు 3 వేలకు పైగా స్క్రీన్ లో రిలీజ్ చేయబోతున్నారు.. మొత్తానికి అయితే ఇప్పటివరకు ఉన్న అన్ని చిత్రాల రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయబోతుందని స్పష్టం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news