అవతార్ 2: ఏదో అనుకుంటే మరేదో అయ్యింది గా.!

-

అవతార్ 2 సినిమా భారత్ లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నాలుగు వేలకు పైగా తెరలపై విడుదల అయ్యింది. ముందు విడుదల అయిన అవతార్ 1 చూసి ఎంతో మంది అవతార్ 2 కూడా సూపర్ గా ఉంటుందని చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల చేసిన డిస్నీ షేర్లు కూడా ఢమాల్ అంటున్నాయట.

కొంత మంది ఈ సినిమా మళ్లీ రికవరీ అయ్యే అవకాశం ఉందని అంటుంటే మరికొంత మంది అలాంటి ఛాన్స్ లేదని అంటున్నారు.అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ కి  ప్రేక్షకుల నుంచి  డివైడ్ టాక్ వచ్చింది.  కథలో కొత్తదనం లేకపోవడం…కేవలం విజువల్ గా గ్రాఫిక్స్ మాత్రమే ఉండటం చాలా మంది ఎక్ష్పెక్టేషన్ రీచ్ కాలేదు. అదీ కాకుండా అందరూ ఓటీటి  లకు అలవాటు పడ్డ కాలంలో సినిమా మూడు గంటల పైన అంటే వామ్మో అంటున్నారు.

మరి కొంత మంది అవతార్ వసూళ్లు క్రమేణా పెరుగుతాయని…సినిమాకి లాంగ్ రన్ ఉంటుందని అంటున్నారు.క్రిస్మస్ సెలవుల సీజన్, కొత్త సంవత్సరం అవతార్-2 వసూళ్లకు కీలకంగా మారే అవకాశం ఉందంటున్నారు. అన్ని సినిమాల రికార్డ్ బ్రేక్ చేస్తుందని హోప్ పెట్టుకుంటే కనీసం టాప్ 5 ప్లేస్ లో ఉండదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news