ఈ రోజు తెలంగాణ హై కోర్ట్ లో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ మీద వాదనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ వాదనలు అటు అవినాష్ రెడ్డి తరపు లాయర్ మరియు సిబిఐ తరపు లాయర్ ఇద్దరూ న్యాయమూర్తి ఎదుట వినిపించారు. కాగా మధ్యలో న్యాయమూర్తి వివేకా హత్యకు కారణాలు ఏమిటన్నది మీకు తెలుసా అని అడిగిన ప్రశ్నకు… అవినాష్ లాయర్ సమాధానం ఇస్తూ వివేకా హత్య జరగడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని.. వివేకా రెండవ భార్యతో సునీతకు ఉన్న గొడవలు, వ్యాపారాలలో గంగిరెడ్డితో ఉన్న గొడవలు, వివేకాకు సునీల్ యాదవ్ తల్లితో ఉన్న వివాహేతర సంబంధం మరియు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని ఆయన వినిపించారు.