ఈ మధ్యకాలంలో చాలా శాతం మంది ఆర్థిక అవసరాల కోసం పర్సనల్ లోన్ ను తీసుకుంటున్నారు. అయితే లోన్‌కు సంబంధించిన ప్రక్రియలు కూడా ఎంతో సులభంగా మారడంతో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే పూర్తి వివరాలు తెలియకపోవడంతో ఎంతో నష్టపోతున్నారు అని చెప్పాలి. అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్ లోన్ ఎంతో సులభంగా లభించినా సరే, దానిని తిరిగి చెల్లించడానికి ఎంతో కష్టపడాల్సి వస్తోంది. ముఖ్యంగా రుణదాతలు, బ్యాంకులు, ఆర్థిక వ్యవస్థలు ఎంతో సరళమైన టెన్యూర్లను రూపొందిస్తున్నారు. పైగా ఎంతో త్వరగా లోన్‌ను అందిస్తున్నారు.
కాకపోతే వ్యక్తిగతంగా రుణాలు తీసుకోవడం ఎంతో ప్రమాదం అనే చెప్పాలి. పర్సనల్ లోన్ తీసుకునే ముందు లోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలి. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పర్సనల్ లోన్ ను తీసుకోవాలి. అనవసరంగా పర్సనల్ లోన్ తీసుకోవడం వలన, తిరిగి చెల్లించడానికి ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటారు. కనుక కేవలం కొన్ని అత్యవసర పరిస్థితులకే లోన్ ఎంపిక చేసుకోవాలి. వైద్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు పర్సనల్ లోన్ ను తీసుకోవచ్చు. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తుకు అవసరమయ్యే ఖర్చుల కోసం, ఇంటి నిర్మాణం లేదా ఇంటికి సంబంధించిన ఇతర ఖర్చుల కోసం పర్సనల్ లోన్ ను ఎంపిక చేసుకోవచ్చు.
ఇటువంటి సందర్భాలలో పర్సనల్ లోన్ ను తీసుకున్నప్పుడు, నెలవారి ఈఎంఐలను సరైన ప్రణాళికతో రూపొందించుకోవాలి. ఇలా చేయడం వలన సరైన సమయానికి ఈఎంఐలు చెల్లిస్తారు మరియు రుణాన్ని తిరిగి చెల్లించడం సులభమవుతుంది. అయితే కేవలం ఈఎంఐతో పాటు, పర్సనల్ లోన్ పై ఎన్నో చార్జీలు కూడా ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ చార్జీలు, చెల్లింపు జరిమానాలు వంటి అదనపు చార్జీల గురించి కూడా పూర్తిగా తెలుసుకొని తర్వాతే లోన్ తీసుకోవాలి. ఇటువంటి అత్యవసర పరిస్థితులలో మాత్రమే పూర్తి అవగాహనతో మాత్రమే లోన్ ను తీసుకోవాలి.