తెలంగాణ మహిళలకు మరో కానుక అందింది. ఏకంగా 23 మంది మహిళలకు అవార్డులు ఇవ్వనుంది కేసీఆర్ సర్కార్. 2023 సంవత్సరానికి గాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలకు అవార్డుల ప్రదానం నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ నిర్నయం తీసుకుంది.
ఈ తరుణంలోనే, 23 మంది మహిళలకు అవార్డులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. అలాగేచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వ కానుక ఇచ్చేందుకు సిద్ధం అయింది. ఈ మేరకు 750 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల నిధుల విడుదల చేసింది సర్కార్.పురపాలికల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల కోసం 250 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. మరో 500 కోట్ల రూపాయల నిధులను గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు విడుదల చేశామని వివరించారు.