మహిళలూ మానసికంగా దృఢంగా ఉండడం ఎంతో ముఖ్యం. మానసికంగా దృఢంగా ఉంటే కచ్చితంగా లైఫ్ లో ముందుకు వెళ్లడానికి అవుతుంది చాలామంది మహిళలు వాళ్ళు మానసికంగా దృఢంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోలేరు. మానసికంగా ధృడంగా ఉండే వాళ్ళు ఇలాంటి తప్పులు అస్సలు చేయరు ముఖ్యంగా ఈ ఎనిమిది తప్పులని అస్సలు మానసికంగా దృఢంగా ఉండే మహిళలు చేయరు మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.
ఇతరులతో పోల్చుకోరు:
మానసికంగా దూరంగా ఉండే మహిళలు వాళ్ళని ఇతరులతో పోల్చుకోరు కేవలం వాళ్ల గురించి వాళ్ళే చూసుకుంటారు. వాళ్లతో వాళ్ళని కంపేర్ చేసుకుంటారు తప్ప ఎదుటి వాళ్ళ ధ్యాస వాళ్ళకి అక్కరలేదు.
పర్ఫెక్షన్ కోసం చూడరు:
లైఫ్ లో తప్పులు జరుగుతూ ఉంటాయని ఆ తప్పులని యాక్సెప్ట్ చేస్తారు తప్ప పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకోరు. కొత్త విషయాలని తప్పుల ద్వారా నేర్చుకోవాలని చూస్తారు.
సందేహపడరు:
వాళ్లు విజయం పొందుతున్నారా లేదా అనే అనుమానం వాళ్లకి రాదు కేవలం జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు.
అతిగా ఆలోచించరు:
మానసికంగా దృఢంగా ఉండే మహిళలు అతిగా ఆలోచించరు అతిగా ఆలోచించేసి సమయాన్ని వృధా చేసుకోరు.
కష్టంగా ఉన్న వాటిని వదిలేయరు:
ఇది కష్టంగా ఉంది అది కష్టంగా ఉంది అని మానసికంగా దృఢంగా ఉండే మహిళలు వదిలిపెట్టరు ఎంతటి కష్టమైన వాటినైనా సరే ఎదుర్కొంటారు.
రూల్స్ ని అతిక్రమించడానికి భయపడరు:
కొన్ని కొన్ని సార్లు రూల్స్ ని అతిక్రమించడానికి కూడా వాళ్ళు అస్సలు భయపడరు.
వాళ్లని వాళ్లు బ్లేమ్ చేసుకోరు:
ఏదైనా తప్పు జరిగినా ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నా వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోరు.
సైలెంట్ గా వుండరు:
మానసికంగా దృడంగా ఉండే వాళ్ళు సైలెంట్ గా వుండరు. వాళ్ళు చెప్పాలని అనుకున్నది తప్పక చెబుతారు.