ఎమ్మెల్యే రోజాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఆయేషా మీరా తల్లి

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బీ-ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు రీ-పోస్టుమార్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సందర్భంగా ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురిని చంపిందెవరో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలుసని అన్నారు. తన కూతురు హత్యకు గురైన తర్వాత రోజా ఎంతో హడావుడి చేశారని… నేరస్తులెవరో ఆమెకు తెలుసని అన్నారు. వారి గురించి అసెంబ్లీలో రోజా ఎందుకు మాట్లాడటం లేదని, ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

నాయకులకు, డబ్బున్న వారికే చట్టాలు చుట్టాలని శంషాద్ బేగం అన్నారు. మధ్యతరగతి, పేదలకు ఎప్పుడూ న్యాయం జరగదని చెప్పారు. నేరస్తుల గురించి గతంలో తాను ఒకసారి మాట్లాడితే కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారని… తమ వద్ద కోటి పైసలు కూడా లేవని… ఎలాంటి దావా అయినా వేసుకోవచ్చని అన్నారు. న్యాయం కోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నానని శంషాద్ బేగం తెలిపారు. ఇప్ప‌టికైనా న్యాయం జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్టు ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news