బిగ్‌బాస్ విన్న‌ర్‌కు జోడీగా రాజశేఖర్ కూతురు

-

హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక.. ఈ మధ్యే దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా డిజాస్టర్ అయినా కూడా నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ఆనంద్ దేవరకొండకు జోడీగా శివాత్మిక త‌న‌దైన శైలిలో న‌టించింది. దీంతో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత‌ మంచి కథల కోసం వెయిట్ చేస్తున్న ఆమె, కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషం. ప్రస్తుతం కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమాను రూపొందిస్తున్నాడు. ‘నట సామ్రాట్’ అనే మరాఠీ మూవీకి ఇది రీమేక్.

ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను బిగ్ బాస్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తీసుకున్నారు. ఆయన జోడీగా శివాత్మికాను ఎంపిక చేశారట. ఇద్దరి కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చుతుండటం మరో విశేషం. కాగా, నిన్నే పెళ్ళాడుతా, మురారి, ఖడ్గం, రాఖి లాంటి సినిమాలు కృష్ణవంశీ కెరియర్ లో దిబెస్ట్ గా మిగిలాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news