అయోధ్య రాముడి పేరిట నాణెలు విడుదల

-

అయోధ్య రాముడి పేరిట ముద్రించిన నాణెలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం విడుదల చేశారు.ఈ నాణెలపై రామ్‌లల్లా, అయోధ్య ఆలయ చిహ్నాలను ముద్రించారు. కాగా, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాగా దేశ విదేశాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజరు అయిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ మహాత్తర ఘట్టం పూర్తయింది. బాలరాముడి ప్రత్యేకంగా తయారు చేయించారు.

విగ్రహానికి పాలు, నీరు, గంధం, కుంకుమ ఎన్ని పూసినప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలా తయారు చేయించారు. ఎలాంటి వాతావరణంలోనైనా ఈ విగ్రహం బలంగా ఉంటుంది.ఇక అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం లో బాల రాముడి రూపంలో కొలువుదీరిన శ్రీరాముని దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. బాలరాముడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news