మాల ధారణం.. నియమాల తోరణం.. అయ్యప్ప దీక్ష.. ఆరోగ్య రక్ష

-

భూతనాథ సదానంద సర్వ భూత దయాపర! రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః

కఠిన నియమాలతో ఆచరించే అయ్యప్ప దీక్ష ఆధ్యాత్మికత భావాన్ని పెంపొందించడమే కాకుండా ఆరోగ్యాన్ని సైతం పెంచుతుంది. దీక్షా కాలంలో నిష్టతో ఓ క్రమపద్ధతిలో జీవనం సాగించడం, నిత్యం దేవుడిని ధ్యానం చేయడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయి. కఠినమైన నియమాలు, అయ్యప్ప కృపతో స్వాములకు లభించే ఆరోగ్య ఫలాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.

చన్నీటి స్నానం
భక్తు దీక్షాకాలం అంతా తెల్లవారుజామునే లేచి చన్నీటితో శిరస్నానం చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. దీనివల్ల మనస్సుకు హాయి కలుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే శిరోభాగం(మెదడు) ఎన్నో ఆలోచనలకు కేంద్ర బిందువు. నిత్యం ఆలోచనలతో మెదడులో రాపిడి ఏర్పడి తల వేడెక్కుతుంది. ఇది ఆరోగ్యానికి ఒక రకంగా హాని కల్గిస్తుంది. ప్రతి రోజు చన్నీటి స్నానం చేయడం వల్ల ఉష్ణం నుంచి తలకు ఉపశమనం లభిస్తుంది.

మితాహారం..
దీక్షాపరులు ప్రతిరోజూ మితాహారం తీసుకుంటారు. దీని వల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఆరోగ్యం బాగుండడంతో పాటుగా వ్యాధులు దూరమవుతాయి. దీక్షాధారులు తీసుకునే ఆహారం పూర్తిగా సాత్వికంగా ఉంటుంది. ఈ వంటల్లో వెల్లుల్లి, ఉల్లి, అల్లం వంటి మసాలా దినుసులను ఉపయోగించరు. దీని వల్ల తిన్న ఆహరం తేలికగా జీర్ణమవుతుంది.

పాదరక్షలు లేకుండా
శబరిమల, ఇతర యాత్రలకు వెళ్లేటప్పుడు పాదరక్షలు లేకుండానే చేయాల్సి వస్తుంది. దీని వల్ల యాత్రకు ఎలాంటి ఇబ్బందులు రావు. భూమికి ఊష్ణోగ్రత, అయస్కాంతత్వం ఉంటాయి. పాదాలు నేరుగా భూమిని తాకడం వల్ల భూస్థితికి తగిన రీతిలో రక్త ప్రసరణ, హృదయ స్పందన సమకూరుతాయి.

భూతలశయనం
దీక్ష చేపట్టే భక్తులు నిత్యం కఠిక నేలపై నిద్రిస్తుంటారు. భూతలశయనం సుఖాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. భూమి మీద కాసేపు పడుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది. భూమిలో శక్తి మార్పిడి శరీరానికీ శక్తిని అందిస్తుంది.

చల్లని చందనం
రెండు కనుబొమ్మల మధ్య నుదిటి భాగం యోగా రీత్యా విశిష్టమైంది. పాలభాగంగా పిలిచే ఈ ప్రాంతంలో ఇతరుల దృష్టి కేంద్రీకృతమవుతుంది. కుంకుమ, విభూది, గంధం, చందనాల్లో ఏదో ఒకటి పెట్టుకోవడం వల్ల ఇతరుల దృష్టి మనపై కేంద్రీకృతం కాదు. నాడీ మండలానికి కేంద్రమైన నుదిటిభాగంపై సున్నితమైన ఒత్తిడి ఆరోగ్యధాయకరమైంది.

నల్లని దుస్తులు
అయ్యప్పస్వాములు నల్లని దుస్తులు ధరించాలన్న నియమం ఉంది. భక్తులు దీక్షలను చలికాలంలో చేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో ఎండ వేడిమిని వెంటనే గ్రహించి రక్షణ కల్పించడంలో నలుపురంగు ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా దీక్షాకాలం ముగిసిన తరువాత శబరీశుడి దర్శన కోసం భక్తులు వనయాత్ర చేయాల్సి ఉంటుంది. అక్కడ వన్యమృగాల బారిన పడకుండా ఉండేందుకు నలుపురంగు రక్షణగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news