కాంగ్రెస్ లో ఒకప్పుడు కీలక నేతగా వ్యవహరించిన జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ గురించి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చాలా నమ్మకస్థుడు మరియు విదేయుడుగా ఉన్నాడు, కానీ ఏఐసీసీ అధ్యక్షుడు ఎంపికలో బేధాలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. తాజాగా ఈయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులను నవ్వుకునేలా చేస్తున్నాయని చెప్పాలి. ఈయన రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ… రాహుల్ గాంధీకి మరియు ఆయన కుటుంబ సభ్యులకు మన దేశంలోని అనర్హులైన కొందరి వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయని బాంబు పేల్చారు.