కామెడీ హీరోకి కంటెంట్ ఉన్న టైటిల్

-

కమెడియన్స్ హీరో అవడం కొత్తేమి కాదు సునీల్ అలా టర్న్ తీసుకుని మొదట్లో సక్సెస్ అందుకున్నా వరుసగా ఫ్లాపులు పలుకరిస్తుంటే చిన్నగా మళ్లీ పాత పద్ధతికే వచ్చేశాడు. ఇక సునీల్ దారిలో మరికొందరు నడుస్తున్నారు వారిలో ముందుగా చెప్పుకుంటే సప్తగిరి వస్తాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగా మారిన సప్తగిరి ఆ సినిమాతో పర్వాలేదు అనిపించుకోగా ఆ తర్వాత వచ్చిన సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమాతో కూడా సత్తా చాటాడు.

ఇక ఇప్పుడు సప్తగిరి హీరోగా మరో సినిమా వస్తుంది. ఆ సినిమా టైటిల్ వజ్ర కవచధర గోవింద అని ఫిక్స్ చేశారు. అనీల్ పవార్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. సప్తగిరి మార్క్ కామెడీతో వస్తున్న ఈ సినిమా టైటిల్ విన్న ఆడియెన్స్ ఇంత పవర్ ఫుల్ టైటిల్ కమెడియన్ కు ఎలా సూట్ అవుతుందని అంటున్నారు. అయితే కంటెంట్ లో దమ్ము ఉండాలే కాని ఎలాంటి టైటిల్ అయినా ఎలాంటి హీరోకి అయినా సరిపోతుంది. సప్తగిరి ఎక్స్ ప్రెస్ డైరెక్ట్ చేసిన అరుణ్ పవార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఈ వజ్ర కవచధర గోవింద సినిమా సప్తగిరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version