కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ఓ వైపు సైంటిస్టులు, ఫార్మా కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మనం ఆశించిన స్థాయి ఫలితాలు మాత్రం రాలేదు. అయితే యోగా గురువు బాబా రాందేవ్ మాత్రం కరోనాకు మందును కనుగొన్నట్లే అనిపిస్తోంది. ఎందుకంటే.. ఆయన గిలాయ్ (తిప్పతీగ), అశ్వగంధ అనే రెండు మూలికలు కరోనాను నాశనం చేస్తాయని చెప్పడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.
వైరస్ మన శరీరంలోకి ప్రవేశించాక మన శరీరంలోని కణాలను నాశనం చేస్తుంది. దీంతో వైరస్ కణాల సంఖ్య పెరుగుతుంది. ఆ వైరస్ తన కణాలను తాను వృద్ధి చేసుకుంటుంది. దీంతో శరీరంలో ఇన్‌ఫెక్షన్ పెరుగుతుంది. అయితే గిలాయ్ మూలిక మన శరీరంలో వైరస్ అలా వృద్ధి చెందకుండా దాన్ని నాశనం చేస్తుందని బాబా రాందేవ్ చెబుతున్నారు. దీంతో వైరస్ ప్రభావం మన శరీరంలో క్రమంగా తగ్గుతుంది. కాగా కోవిడ్ 19 పేషెంట్లకు గిలాయ్ ఇచ్చామని దాంతో వారు ఆ వైరస్ నుంచి 100 శాతం కోలుకున్నారని, ఎవరూ చనిపోలేదని ఆయన తెలిపారు.
అయితే గిలాయ్‌తోపాటు అశ్వగంధపై కూడా ప్రస్తుతం పతంజలి సంస్థ ప్రయోగాలు చేస్తుందని, అవి పూర్తయ్యాక వాటి సక్సెస్ గురించి ప్రపంచానికి చెబుతామని తెలిపారు. ఇక ఈ రెండు మూలికల వల్ల కరోనాను పూర్తిగా నాశనం చేయవచ్చని ఆయన అంటున్నారు. దీంతో కరోనా లక్షణాలు, ఇన్‌ఫెక్షన్ పూర్తిగా తగ్గుతాయని అంటున్నారు.
కాగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), జపాన్‌లోని ఏఐఎస్టీ పరిశోధకులు ఇప్పటికే అశ్వగంధపై ప్రయోగాలు చేసి ఆ మూలిక కోవిడ్ 19 చికిత్సకు సమర్థవంతంగా పనిచేస్తుందని తేల్చారు. అశ్వగంధ ప్రధాన కరోనా లక్షణాలైన దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలను 100 శాతం నయం చేస్తుందని వారి పరిశోధనల్లో వెల్లడైంది. అయితే బాబా రాందేవ్ చెప్పిన మెడిసిన్ విడుదలయ్యేందుకు ఎన్ని రోజులు పడుతుందో చూడాలి.