పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ గురించి ఇద్దరు మాజీ పాక్ ఆటగాళ్లు వాదనలు చేసుకుంటున్నారు. ఇటీవల ఇండియా తో పాకిస్తాన్ ఓడిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయబ్ మాలిక్ సోషల్ మీడియా వేదికగా బాబర్ ఆజామ్ కెప్టెన్ గా విఫలం అవుతున్నాడు. కెప్టెన్ గా తనకు నిరూపించుకునే ప్రక్రియలో ఒక బ్యాట్స్మన్ గా కూడా ఫెయిల్ అవుతున్నాడు. అందుకే తన కెప్టెన్సీ కి రాజీనామా చేసి, షహీన్ ఆఫ్రిదికి ఇవ్వాలంటూ ఒక ప్రతిపాదన తెచ్చాడు. ఈ మెసేజ్ కు మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ మాట్లాడుతూ వరల్డ్ కప్ లాంటి కీలకమైన టోర్నీలో ఉన్నప్పుడు అతనికి అసంతృప్తిని కలిగించే మాటలు అనడం సరికాదంటూ, బాబర్ లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ బాబర్ కు మద్దతుగా నిలిచాడు.
అయితే బాబర్ కెప్టెన్సీ ని మార్చమని చెప్పడం కరెక్ట్ కాదంటూ చాలా మంది చెబుతున్నారు. మ్యాచ్ లు గెలవడం ఓడడం సాధారణమే.. అంత మాత్రాన కెప్టెన్ లను మార్చుకుంటూ పోతే ఎవరూ మిగలరు.