బలపడాలి, నిలబడాలి, ఎదురు తిరగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలను మెప్పించాలి, ప్రజలను గౌరవించాలి, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేకతను నిరూపించాలి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, నిలబడాలి అంటే కచ్చితంగా ప్రభావం చూపించాలి. అలాంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆ పార్టీ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నాయకత్వ లేమి తో ఇబ్బంది పడుతున్న ఆ పార్టీ సరైన నాయకులు లేక ఇబ్బంది పడుతుంది.
ఈ తరుణంలో ఆ పార్టీ నమ్మిన వాళ్ళు, ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, ఆ పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితులు పార్టీని వీడుతున్నారు. ఇంతకు ఆ పార్టీ ఏదో మీకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది. ఈ పది రోజుల్లో దాదాపు పది మంది నేతలు పార్టీ నుంచి బయటకు రావడంలో వైసీపీకి జై కొట్టడమో జరుగుతూ వస్తుంది.
పార్టీ నుంచి విశాఖ జిల్లాకు చెందిన పంచాకర్ల రమేష్ బాబు తప్పుకున్నారు. రామ సుబ్బారెడ్డి వైసీపీలో జాయిన్ అయ్యారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ జై జగన్ అన్నారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరుతున్నారు. ఆయన చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుడు. ప్రకాశం జిల్లాలో పార్టీకి బలరాం పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన పార్టీని వీడుతున్నారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో టీడీపీలో చేరిన కరణం బలరాం, 5 సార్లు ఎమ్యెల్యేగా, ఒక సారి లోక్‌సభకు ఎన్నికైన కరణం బలరాం ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి బాటలోనే బలరాం కూడా స్వతంత్ర అభ్యర్ధిగా కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు పార్టీని కంగారు పెడుతుంది. ఇంకెవరు టీడీపీని వదిలేస్తారో అనే భయం పార్టీ నేతల్లో ఉంది.