వావ్‌.. విమానం గాల్లో ఉండగానే ప్రసవం.. బిడ్డ పేరోంటో తెలుసా..?

ప్రతి ఒక్కరూ జన్మిస్తారు.. కానీ కొందరు జన్మిస్తూనే అద్భుతాలు సృష్టిస్తారు. అలాంటి ఘటనే ఇదిం. అమెరికాలోని డెన్వర్ నుంచి ఒర్లాండో వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విమానంలో పుట్టిన ఆ పాపకు ‘స్కై’ అని నామకరణం చేశారు కుటుంబ సభ్యులు. ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ విమానం డెన్వర్ నుంచి ఒర్లాండో బయలుదేరింది. అందులో షకేరియా మార్టిన్ అనే నిండు గర్భిణి కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.

Baby born mid-flight in lavatory of Frontier Airlines flight to Florida  named 'Sky'

విమాన సిబ్బందిలో ఒకరైన డయానా గిరాల్డో వెంటనే స్పందించి నొప్పులతో బాధపడుతున్న షకేరియాను బాత్రూములోకి తీసుకెళ్లగా అందులోనే ఆమె ప్రసవించింది. షకేరియా సుఖ ప్రసవానికి సహకరించిన డయానును ప్రయాణికులు, విమానయాన సంస్థ అధికారులు ప్రశంసించారు. మరోవైపు, విమానం గాల్లో ఉండగా జన్మించిన ఆ శిశువుకు కుటుంబ సభ్యులు ‘స్కై’గా నామకరణం చేశారు. ఒర్లాండో విమానాశ్రయ సిబ్బందికి విషయం తెలియజేయడంతో విమానం ల్యాండ్ కాగానే షకేరియా, ఆమె బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.