ఓరిదేవుడా: రికార్డులు సృష్టిస్తున్న “బేబీ” మూవీ … !

-

యువ దర్శకుడు సాయి రాజేష్, హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు హీరోయిన్ చైతన్య వైష్ణవి ల కాంబినేషన్ లో రిలీజ్ అయిన కల్ట్ మూవీ “బేబీ”. ఈ సినిమా రిలీజ్ కు ముందు పాటలతో మంచి అంచనాలను అందుకుంది., ఇక రిలీజ్ తర్వాత అయితే ఈ సినిమా విజయాన్ని ఆపడం ఎవరితరం కావట్లేదు అని చెప్పాలి. విడుదల అయిన అన్ని చోట్ల రోజులో అన్ని షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. టాలీవుడ్ లో ఒక చిన్న సినిమాగా విడుదలైన బేబీ కేవలం రెండు వారాలు కూడా పూర్తి కాకముందే రూ. 70 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. గతంలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీ ఫైనల్ కలెక్షన్ లకు అతి తక్కువ రోజుల్లోనే క్రాస్ చేసి రికార్డ్ సాధించింది. అన్న సినిమా కలెక్షన్ లను అధిగమించిన తమ్ముడుగా ఆనంద్ దేవరకొండ విజయం సాధించాడు.

ఇంకా ఫుల్ రన్ లో మరిన్ని కోట్ల కలెక్షన్ లను అందుకుంటుందో చూడాలి. ప్రతి ఒక్క ప్రేమికుల మనసును హత్తుకునే ప్రేమకావ్యంగా చరిత్రలో నిలిచిపోయే సినిమా అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news