ఇక పిల్లలు ఉన్న తల్లులు కూడా పిల్లలను పక్కన పెట్టి మరీ ఫోన్ లో సమయం గడపడంతో పిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో పిల్లలతో ఆడుకునే అమ్మలు ఇప్పుడు ఫోన్ లో ఆడుకుంటూ వారికి తల్లి ప్రేమను దూరం చేయడంతో పాటు పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఫోన్ లో మాట్లాడుతూ పిల్లాడిని వదిలేయడంతో ఆ బాబు ప్రాణం మీదకు వచ్చింది. త్రుటిలో బాబు ప్రాణాల నుంచి బయటపడ్డాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే…
Please Please don’t use Mobile phones .. Especially when you are out with little Children ???? pic.twitter.com/0HufwEUTJB
— Rosy (@rose_k01) November 2, 2019
కొడుకుతో కలిసి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తల్లి.. ఫోన్‌లో మాట్లాడుతూ అక్కడే నిలబడ్డారు. ఇక పిల్లాడు తల్లి చేయి వదిలేసి పక్కనే ఉన్న మెట్ల దగ్గరకు వెళ్లి వాటికి ఉన్న రెయిలింగ్ పట్టుకుని వేలాడుతూ… ముందుకు చూస్తూ వంగాడు. ఒక్కసారిగా కిందకు పడబోతుండగా ఇంతలో వెనక్కు తిరిగిన తల్లి గమనించి వెంటనే ఆ పిల్లాడి కాలు పట్టుకుని పైకి లాగింది. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంది వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడ ఉన్న సీక్రెట్ కెమెరాలు ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసాయి.