ట్రంప్ కి కోర్టులో ఎదురుదెబ్బ…!

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు.. కోర్టుల్లో కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జార్జియా, మిషిగన్‌లలో రిపబ్లికన్లు వేసిన దావాల్ని కోర్టులు కొట్టేశాయ్. మిచిగాన్‌లో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. బ్యాలెట్ డ్రాప్ బాక్సుల వీడియోను యాక్సెస్ చేయలేదని ఆరోపిస్తూ ట్రంప్ దాఖలు చేసిన దావాను తిరస్కరించామని కోర్టు క్రెయిమ్ న్యాయమూర్తి సింథియా స్టీఫెన్ చెప్పారు.

ట్రంప్ ఫిర్యాదు ఓట్ల లెక్కింపు ప్రక్రియతో సంబంధం లేనందున మిచిగాన్ రాష్ట్ర కార్యదర్శిపై దాఖలైన వ్యాజ్యం సరిపోదని న్యాయమూర్తి చెప్పారు.ఓట్ల లెక్కింపు పూర్తి కానున్న దశలో దీన్ని నిలిపివేయలేమని న్యాయమూర్తి స్టీఫెన్ పేర్కొన్నారు. మిచిగాన్ లో బిడెన్ గెలవడానికి కొద్దిసేపటి ముందు పెన్సిల్వేనియా, మిచిగాన్ లలోని కోర్టులో వ్యాజ్యాలు సమర్పించారు.

కీలకమైన పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యం క్రమంగా తగ్గుతోంది. 20 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియా.. ట్రంప్‌కు అత్యంత కీలకం. నిన్న ఈ రాష్ట్రంలో 5 లక్షల ఓట్ల మోజార్టీతో ఉన్న ట్రంప్‌.. ఇప్పుడు కేవలం 50 వేల పైచిలుకు ఆధిక్యానికే పరిమితమయ్యారు. ఇక 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న జార్జియాలో కూడా ట్రంప్‌ ఆధిక్యం తగ్గిపోతోంది. జార్జియా, పెన్సిల్వేనియాలో కనుక ట్రంప్‌ ఓడితే.. ఆయన అధ్యక్ష రేసు నుంచి వైదొలిగినట్లే.

Read more RELATED
Recommended to you

Latest news