బ్యాక్‌లాగ్ పోస్టులు.. ప్రజాభవన్‌లో గురుకుల అభ్యర్థుల ఆందోళన!

-

కాంగ్రెస్ సర్కారుకు తాజాగా గురుకుల అభ్యర్థుల నుంచి నిరసన సెగ ఎదురైంది. బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులైన అభ్యర్థులకు కేటాయించాలని ప్రజాభవన్‌లో శుక్రవారం ఆందోళనకు దిగారు. ఇదిలాఉండగా, గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటికే గురుకులాల్లో నూతన నియామకాలు భర్తీ చేసిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు నియమ నిబంధనలు పాటించకపోవడంతో బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలిపోయాయి.

వాటిని వెంటనే అర్హులైన మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్‌లో గురుకుల అభ్యర్థులు ధర్నా చేపట్టారు.ప్రభుత్వం తొందర పాటు నిర్ణయం, అధికారుల నిర్లక్ష్యంతో మూడు వేల కుటుంబాలకు అన్యాయం జరిగిందని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం నిర్వహించిన కాంపిటేటివ్ పరీక్షలు రాసి మెరిట్ తెచ్చుకొని, అర్హత ఉన్నా ఉద్యోగాలు రాలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన గురుకుల అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news