సిరిసిల్ల నేతన్నలకు 50 శాతం సబ్సిడీ కరెంట్‌ ఇవ్వాల్సిందే – KTR

-

సిరిసిల్ల నేతన్నలకు 50 శాతం సబ్సిడీ కరెంట్‌ ఇవ్వాల్సిందే అని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన నాడు మనం తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉన్నామన్నారు. పారిశ్రామికవేత్తలు పవర్ హాలిడేస్ వద్దని ఇందిర పార్క్ వద్ద ధర్నాలకు దిగిన పరిస్థితి. మరో వైపు రైతులు కరెంట్ లేక తీవ్ర నిరాశలో ఉన్న పరిస్థితి అని తెలిపారు. మా సిరిసిల్లలో కూడా పవర్‌లూమ్ పరిశ్రమ కరెంట్‌తోనే ముడి పడి ఉంది.

ఇక్కడ కూడా కరెంట్ లేక ఎంతో మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా సిరిసిల్లలో నేతన్నలకు 10 హెచ్‌పీ మీద 50 శాతం సబ్సిడీ కూడా ఇచ్చామన్నారు. ఇప్పుడు 10 హెచ్‌పీలను 30 హెచ్‌పీల వరకు పెంచి 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఇళ్లకు 300 యూనిట్లకు దాటితే ప్రస్తుతం ఉన్న రూ. 10 ఫిక్స్‌డ్ ఛార్జీలను 50 కి పెంచాలని ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తున్నామని వివరించారు. ఒక్క సెస్ పరిధిలోనే తీసుకుంటే లక్షా 20 వేలకు పైగా కనెక్షన్లు ఉంటే 75 వేల కనెక్షన్ల వరకు ఎండకాలంలో 300 యూనిట్లకు పైగా వాడుతున్నారన్నారు. కరెంట్ వినియోగమనేది గతంతో పోల్చితే చాలా వరకు పెరిగిందని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news