పబ్జి మొబైల్ గేమ్ ప్రియులకు నిజంగా ఇది చేదువార్తే. గేమ్ ఇప్పట్లో లాంచ్ అయ్యే సూచనలు అయితే కనిపించడం లేదు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో దేశ భద్రత దృష్ట్యా కేంద్రం 118 చైనా యాప్‌లను బ్యాన్ చేయగా.. వాటిల్లో పబ్జి గేమ్ యాప్ కూడా ఉంది. అయితే టెన్సెంట్ గేమ్స్‌తో పార్ట్‌నర్‌షిప్‌ను కట్ చేసుకుని పబ్జి కార్ప్ సొంత సంస్థగా భారత్‌లో రిజిస్టర్ చేసుకుంది. అందులో భాగంగానే పబ్జి మొబైల్ ఇండియా పేరిట గేమ్‌ను రీ లాంచ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే గేమ్‌ను మళ్లీ భారత్‌లో లాంచ్ చేసేందుకు ఇప్పటికీ పబ్జి యాజమాన్యానికి ఇంకా అనుమతులు లభించలేదు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పబ్జి మొబైల్ ఇండియా గేమ్‌కు ఇంకా అనుమతి ఇవ్వలేదు. గేమ్ లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ గత నెల రోజులుగా గేమ్ యాజమాన్యం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ వారికి నిరాశే ఎదురైంది. ఓ దశలో గేమ్ లాంచ్ అయినట్లేనని భావించారు. కానీ సదరు మంత్రిత్వ శాఖ అనుమతులు ఇంకా ఇవ్వలేదు. దీంతో గేమ్ ఎప్పుడు లాంచ్ అవుతుందా.. అని పబ్జి ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే 2021 మార్చి వరకు పబ్జి మొబైల్ ఇండియా గేమ్ లాంచ్ అయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఆ తరువాతే గేమ్ విడుదలవుతుందని సమాచారం. కాగా పబ్జి కార్పొరేషన్ భారత యూజర్లకు తగినట్లుగా గేమ్‌లో అనేక మార్పులు చేసింది. ఇక డేటా స్టోరేజ్ విషయమై మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కూడా కుదర్చుకుంది. అనేక మార్పులు చేసినా గేమ్‌కు రీ లాంచ్ అయ్యేందుకు ఇంకా అనుమతి లభించకపోవడం పబ్జి ప్రియులను ఆందోళనకు గురి చేస్తోంది. మరి గేమ్ లాంచ్ అవుతుందా, లేదా..అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.