నేటి కాలం లో ప్రతి ఒక్కరి జీవితం లో స్మార్ట్ ఫోన్ ఒక భాగమై పోయింది. రాత్రి పూట కూడా మంచం మీద దానిని పెట్టేసి నిద్రపోతున్నారు. చాలా మంది ఇలానే చేస్తున్నారు. మీరు కూడా ఇలానే చేస్తున్నారా…? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే దీని వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
తాజాగా చేసిన రీసెర్చ్ ప్రకారం కొన్ని విషయాలు బయట పడ్డాయి. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల క్యాన్సర్ రిస్కు పెరుగుతోందని చెబుతున్నారు. ఐసిఆర్ఏ స్మార్ట్ ఫోన్ వల్ల చెవి లో ట్యూమర్ వస్తుందని వెల్లడించింది. అలానే క్యాన్సర్ కూడా పెరగడానికి కారణం అవుతుందని చెప్పింది.
ఫోన్ ద్వారా వచ్చే ఎలెక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తాయని అంటున్నారు. ప్యాంట్ జేబు లో స్మార్ట్ ఫోన్ ని పెట్టుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది అని చెప్తున్నారు. అలానే ఎగ్ ఫెర్టిలైజేషన్ కూడా స్లో అవుతుందని చెప్తున్నారు.
అదే ఒకవేళ మీకు తలకింద ఫోన్ పెట్టుకొని నిద్ర పోయే అలవాటు ఉంటే తప్పకుండా దానిని మానుకోండి. అలానే ఫోన్ ద్వారా వచ్చే బ్లూ లైట్ వలన స్లీప్ హార్మోన్ మీద ప్రభావం చూపుతుందని. ఇది నిద్రలేని సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. కాబట్టి నిద్రపోయే అరగంట ముందు మీరు మీ ఫోన్ ని ఆఫ్ చేసి అప్పుడు నిద్ర పోవడం చాలా ముఖ్యం.