దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం మాత్రం స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి ఝలక్ ఇచ్చింది. మీకు కూడా స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ వుందా…? అయితే ఇది మీకు బ్యాడ్ న్యూస్.
మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడితే తప్పక దీని గురించి తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎస్‌బీఐ కార్డు తన కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. కొత్తగా చార్జీలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో క్రెడిట్ కార్డుని ఉపయోగించే వాళ్ళ పై ఎఫక్ట్ పడనుంది.
డిసెంబర్ 1 నుంచి ఈఎంఐ లావాదేవీల పై ప్రాసెసింగ్ చార్జీని వసూలు చేస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ చెప్పింది. అదే విధంగా ఇంకా అదనపు చార్జెస్ కూడా పడతాయి అని ఎస్బీఐ అంది. ఎస్‌బీఐ కార్డు ఈమెయిల్ ద్వారా ఇప్పటికే వినియోగదారులకు ఈ విషయాన్ని తెలియజేసింది.
ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.99 ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ట్యాక్స్‌లు చెల్లించాలి. అదే విధంగా మర్చింట్ ఔట్‌లెట్స్, ఈకామర్స్ వెబ్‌సైట్లు, యాప్స్‌లో నిర్వహించే ఈఎంఐ లావాదేవీలకు చార్జీలు కూడా పడతాయ్. అయితే ఈ మార్పు డిసెంబర్ 1 నుంచి రానుంది. అందువల్ల ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే వారు వీటిని గమనించడం మంచిది.