తెలంగాణాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి కి వెళ్ళే భక్తులకు ఆలయ నిర్వాహకులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆర్జిత సేవల టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించారు. స్వామి వారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలు మరియు ప్రసాదాల ధరలను పెంచారు. సత్యనారాయణ వ్రతం ధర ఇదివరకు రూ.500 కాగా దానిని రూ. 800 లకు పెంచారు. నిత్య కళ్యాణం టికెట్ ధర గతంలో రూ.1,250 ఉండా ఇప్పుడు రూ. 1500 లకు పెంచారు.
అష్టోత్తర టికెట్ ధరను రూ.100 నుండి రూ.200 లకు పెంచారు. మరోవైపు లడ్డూ ధర గతంలో రూ.20 రూపాయలు కాగా ఇప్పుడు దాన్ని రూ. 30 గా నిర్ణయించారు. పులిహోర మరియు వడల ధరలు కూడా రూ. 15 నుండి రూ.20 కి పెంచినట్టు ప్రకటించారు. అంతే కాకుండా పెరిగిన ధరలు కూడా ఈరోజు నుండే అమలు లోకి రానున్నాయి. ఇదిలా ఉండగా యాదాద్రి పునర్నిర్మాణం తరవాత భక్తుల రద్దీ కూడా పెరిగినట్టు తెలుస్తోంది. ఆలయాన్ని చూసేందుకు…స్వామి వారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వస్తున్నారు.